Share News

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:13 AM

Harassment Of Women: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Harassment Of Women

తూర్పుగోదావరి, మార్చి 26: రాను రాను సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతీరోజు ఏదో ఒక చోట కామంధులకు ఆడపిల్లలు బలవతూనే ఉన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అనేది లేకుండా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రేమ పేరుతో కొందరు, బాత్రూమ్‌లలో వీడియోలు పెట్టి మరికొందరు అమ్మాయిలను వేధిస్తూనే ఉన్నారు. కొందరు ఆడపిల్లలు తిరగబడుతుంటే.. మరికొంత మంది మాత్రం ఆ కామాంధుల వేధింపులకు నలిగిపోతూనే ఉన్నారు. ఆడపిల్లలను రక్షించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని చట్టాలను తీసుకొచ్చినా కూడా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari District) ఓ మహిళల పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


జిల్లాలోని పిరా రామచంద్రపురం గ్రామంలో ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ స్నానం చేస్తున్న సమయంలో నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రీ రామకృష్ణారెడ్డిలు రహస్యంగా వీడియోలు తీశారు. ఆ తరువాత ఆ వీడియోలను మహిళకు చూపించి వేధింపులు మొదలు పెట్టారు. స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియో బయటకు రాకుండా ఉండాలంటే తమ కోరిక తీర్చాలంటూ మహిళను బ్లాక్ మెయిల్ చేశారు. ఎవరికైనా చెబితే అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బాధితురాలిని బెదించారు.

YSRCP Corruption: ఆఖరికి కుక్కల తిండినీ వదలలేదుగా..


ఏం చేయాలో తెలియక మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది. చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఇద్దరిపై అనపర్తి పోలీస్‌స్టేసన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా నిందితులను పట్టుకుని వీడియోలు డిలీట్ చేయాలంటూ బాధితురాలు పోలీసులను వేడుకుంది. అయితే మహిళ అశ్లీల వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 11:37 AM