Share News

M. Venkaiah Naidu : సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోండి!

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:26 AM

సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ నేటి యువతరం కాలంతో పాటు

 M. Venkaiah Naidu : సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోండి!

  • అందుకు తగ్గట్టు యువత సన్నద్ధమవ్వాలి

  • నేడు ఏదో రంగంలో నైపుణ్యం అవసరం

  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

వెంకటాచలం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ నేటి యువతరం కాలంతో పాటు మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న వారితో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వెంకయ్య సమాధానాలు ఇచ్చారు. సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుంటూ.. అందుకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆలోచనలు కూడా మారాలన్నారు. యువత ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డా రు. కేవలం డిగ్రీలు, పీజీలతో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదని, నైపుణ్యం ఉంటే జీవితంలో సొంత కాళ్లపై నిలబడవచ్చన్నారు. ప్రభు త్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండానే స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను అందిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 05:26 AM