AP Assembly Budget Session 2025: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
ABN , Publish Date - Feb 20 , 2025 | 03:03 PM
AP Assembly Budget Session 2025: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో స్పల్ప మార్పు చోటు చేసుకొంది. ఫిబ్రవరి 28వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టునున్నారు. అసలు అయితే ఈ బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించారు. కానీ బడ్జెట్‌ను నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమవుతోన్నాయి. ఆ క్రమంలో మార్చి 4వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ షెడ్యుల్‌ను కాస్తా ముందుకు జరిపారు. అంటే.. ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అలాగే 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22, 23వ తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అందులోభాగంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 27వ తేదీన జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు వాయిదా పడ్డిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News