Share News

YS Jagan: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !

ABN , Publish Date - Feb 07 , 2025 | 06:55 PM

YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరవుతున్నారు. సభలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఏపీ అసెంబ్లీలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.

YS Jagan: జగన్‍కి ఊహించని షాక్.. ఆ ఐదుగురు జంప్ !
YCP Chief YS Jagan

వైఎస్ జగన్ కు మరో భారీ షాక్ తగలనుందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‍లో వైరల్‍గా మారింది. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో.. ఐదుగురు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచిన వారిని సమాచారం. ఎమ్మెల్యేగా గెలిచినా.. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనలేని పరిస్థితి వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసి.. అసెంబ్లీకి వెళ్లాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే 2014, 2019 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు పార్టీలు మారడం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను సైతం వారు పరిశీలించి ఆచీ తూచీ అడుగులు వేసేందుకు ఆ ఐదుగురు.. తమ తమ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారని ప్రచారం సైతం సాగుతోంది.

Also Read: పిస్తా వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

అదీకాక వై నాట్175 ? అంటూ అధికారంలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకొంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ హోదా కేటాయించాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. స్పీకర్ కు లేఖ రాశారు. కానీ సంఖ్య బలం లేదంటూ స్పీకర్ స్పష్టం చేయడంతో.. వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: కేబినెట్‍పై కాదు కార్యవర్గంపై కసరత్తు


దీంతో గత ఎన్నికల్లో ఓటమి పాలై ఇంట్లో ఉన్న వారికి గెలిచి అసెంబ్లీకి వెళ్లలేక ఇంట్లో ఉండే తమకు ఏ మాత్రం తేడా లేకుండా పోయిందంటూ వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు కేడర్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలంతా శాసన మండలికి వెళ్తున్నారు. కానీ మన పరిస్థితి ఏమిటని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొంటున్నట్లు సమాచారం.

Also Read: 100 మంది అమ్మాయిలు.. రూ.333 కోట్లు.. బత్తుల టార్గెట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే


ఈ ఎన్నికల ముందే కాదు.. ఆ తర్వాత సైతం.. అంటే పార్టీ ఓటమితో పలువురు కీలక నేతలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ రాజ్యసభ స్థానాలకే కాదు... పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి సైతం పార్టీకే కాదు.. రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. చాలా మందే వైసీపీని అధికారికంగా, అనధికారికంగా రాజీనామాలే కాదు.. దూరంగా ఉంటున్నారు.

Also Read: శంషాబాద్ ఎయిర్‍పోర్ట్ లో సెలబ్రటీస్ వెయిటింగ్


దీంతో పార్టీలో కేడర్ కు దిశా నిర్దేశం చేసే నాయకులే లేకుండా పోయారు. ఇటువంటి వేళ.. భవిష్యత్తులో రాజకీయాల్లో మనగలగాలంటే.. వైసీపీకి గుడ్ బై చెప్పడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే భావనలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనా ఈ శివరాత్రి నాటికి వీరంత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ సైతం ఊపందుకొంది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 07 , 2025 | 06:55 PM