Share News

Corruption : విడదల రజనీపై ఏసీబీ కేసు!

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:07 AM

జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని చలపతి ని బెదిరించి రూ.2కోట్లు వసూలుచేసిన పాపం వెంటాడింది.

Corruption : విడదల రజనీపై ఏసీబీ కేసు!

  • ఎమ్మెల్యే హోదాలో వ్యాపారికి బెదిరింపులు

  • ఐపీఎస్‌ పల్లె జాషువా మెడకూ ఉచ్చు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదుకు మార్గం సుగమమైంది. జగన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడదల రజనీని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్‌ క్రషర్‌ యజమాని చలపతి ని బెదిరించి రూ.2కోట్లు వసూలుచేసిన పాపం వెంటాడింది. కృష్ణా, చిత్తూరు జిల్లాల మాజీ ఎస్పీ పల్లె జాషువాకు ఈపాపంలో వాటా ఉన్న ట్లు ఫిర్యాదు అందడంతో ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవుతోంది. అవినీతి నిరోధక చట్టం 17(ఏ) ప్రకారం ఎవరిపై కేసు నమో దు చేసి విచారణ చేపట్టాలన్నా వారిని నియమించే వారి నుంచి అనుమతి తప్పనిసరి. మంత్రిగా పనిచేసినవారిపై విచారణ చేపట్టాలంటే మంత్రిని నియమించిన గవర్నర్‌ నుంచి.. ఐపీఎస్‌ అధికారిపై చర్య తీసుకోవాలంటే వారికి పోస్టిం గ్‌ ఇచ్చే సీఎస్‌ నుంచి అనుమతి కోరుతూ ఏసీబీ లేఖ రాస్తుంది. తాజా వ్యవహారంలో ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువాపై సీఎస్‌ అనుమతి తీసుకున్న ఏసీబీకి మాజీ మంత్రి విడుదల రజనీపై చర్య తీసుకోవడానికి గవర్నర్‌ అనుమతి లభించాలి. ఇదిలావుంటే, న్యాయ నిపుణులు మాత్రం గవర్నర్‌ అనుమతి అవసరం లేదని తేల్చినట్లు సమాచారం. స్టోన్‌ క్రషర్‌ యజమా ని వద్దకెళ్లి మొదట డబ్బు డిమాండ్‌ చేసే నాటికి(2020 సెప్టెంబరు 4న) ఆమె స్థానిక ఎమ్మెల్యే మాత్రమేనని వారు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత గుంటూరు విజిలెన్స్‌ ఆర్‌వీఈవోగా ఉన్న జాషువా స్టోన్‌ క్రషర్‌లో తనిఖీలు చేసి బెదిరించినప్పుడు, ఒత్తిళ్లకు లొంగి ఆయన డబ్బులు అందజేసినప్పుడు(2021 మా ర్చి 4న) కూడా ఆమె ఎమ్మెల్యేనే. ఈ విషయా న్ని గుర్తించిన న్యాయ నిపుణులు గవర్నర్‌ అనుమతి లేకుండా నేరుగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయవచ్చని సూచించినట్లు తెలిసింది.


విడదల రజనీ పనిచేసిన మంత్రిత్వశాఖలో అవినీతికి అప్పట్లో ఆమె పాల్పడినట్లు ఆరోపణలు వస్తేనే, గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉం టుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే హోదాలో చేసిన దందాపై పోలీసులు సైతం కేసు నమోదు చేయవచ్చని వివరించినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సిద్ధమయ్యారు. అయితే, ఇప్పటికే గవర్నర్‌ అనుమతి కోసం రాసినందున ఆయన నుంచి స్పష్టత వచ్చిన తర్వాత కేసు పెట్టనున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన జాషువా మెడకూ ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది.

బిహార్‌ నమూనాలో బీభత్సం..

సకలశాఖల మంత్రిగా పేరున్న నేత అండదండల తో విడదల రజనీ రెచ్చిపోయారు. ఎవరు వ్యాపారాలు చేసుకోవాలన్నా కప్పం కట్టి తీరాల్సిన బిహార్‌ నమూనాకు తెరతీశారు. ఎమ్మెల్యేగా ఉండగానే అక్రమ ఆదాయాలపై దృష్టి పెట్టారు. తన వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ ద్వారా స్టోన్‌ క్రషర్‌ యజమాని చలపతిని రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు. తనిఖీల పేరుతో అదేపనిగా వేధించడంతో చేసేది లేక రూ.2 కోట్లు ఇచ్చేందుకు రజనీ మరిది గోపీతో ఒప్పందం చేసుకున్నారు. చిలకలూరిపేటలోని రజనీ ఇంటికి రూ.2 కోట్లు తీసుకెళ్లి 2021 మార్చి 4న అందజేసినట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రాథమిక దర్యాప్తు చేయించిన ప్రభుత్వం విడదల రజనీ రూ.2 కోట్లతోపాటు విజిలెన్స్‌ ఎస్పీ హోదాలో బెదిరించిన పల్లె జాషువా పది లక్షలు, ఎమ్మెల్యే మరిది గోపీ పది లక్షలు కలిపి మొత్తం 2.20 కోట్లు వసూలు చేసినట్లు తేలింది.

Updated Date - Mar 05 , 2025 | 07:55 AM