Share News

Group-2 Mains Exam: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:48 PM

Group 2 Mains Exam: మరికొద్ది రోజుల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. అలాంటి వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పిబ్రవరి 23వ తేదీ జరగనున్న గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

Group-2 Mains Exam: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
AP High Court

అమరావతి, ఫిబ్రవరి 20: గ్రూప్-2 ప్రధాన పరీక్ష ప్రక్రియను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం కొట్టేసింది. ప్రస్తుత వాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, క్రీడాకారులు, దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ - 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షను నిలువరించాలంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టుపై విధంగా తీర్పు ఇచ్చింది.

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌, స్పోర్ట్స్‌ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్‌ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఫిబ్రవరి 18వ తేదీన హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ వేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.


ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను ఫిక్స్‌ చేసి గ్రూప్‌-2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం. పార్థసారథి, కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్యతోపాటు మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం


అందులో గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌స్‌మెన్‌, స్పోర్ట్స్‌ పర్సన్లకు ప్రత్యేకంగా రోస్టర్‌ స్లాట్స్‌ (రిజర్వేషన్‌ పాయింట్లు) కేటాయిస్తూ 2023, డిసెంబరు 7వ తేదీన ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని హైకోర్టును వారు కోరారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బొద్దులూరి శ్రీనివాసరావు, జీవీ శివాజీ వాదనలు వినిపించారు.

Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..


ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌.. రిజర్వేషన్ల అమలుతోపాటు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోను ఈ సందర్భంగా కోర్టు ముందు ఉంచారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసిందని, ప్రధాన పరీక్షను నిలువరించ వద్దని హైకోర్టును కోరిన విషయం విధితమే. అలాంటి వేళ.. ఏపీ హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 04:53 PM