Share News

AP News: వైసీపీ నేత కుటుంబంపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం..

ABN , Publish Date - Jan 03 , 2025 | 09:40 AM

ఆంధ్రప్రదేశ్: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేదల భూములు కబ్జా చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

AP News: వైసీపీ నేత కుటుంబంపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం..
Deputy CM Pawan Kalyan

కడప: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుటుంబీకులు ప్రభుత్వ, పేదల భూములు కబ్జా (Land Grab) చేశారంటూ పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కబ్జా వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. భూకబ్జాలపై వెంటనే విచారణ చేయాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు. 52 ఎకరాల చుక్కల భూములు, ప్రభుత్వ భూములను సజ్జల కుటుంబీకులు కబ్జా చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా గుప్పుమంటున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చను లేవనెత్తింది.


సజ్జల కుటుంబం కబ్జాలపై ఎబీఎన్ ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ప్రచురించింది. ఈ విషయం కాస్త, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి.. పేదలు, ప్రభుత్వ భూముల జోలికి ఎవ్వరూ వచ్చిన సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు విచారణకు ఆదేశించి కబ్జాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు విచారణ నిమిత్తం రంగంలోకి దిగారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, ఎటువంటి భూములను తాము ఆక్రమించలేదని సజ్జల బుకాయిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Torture Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. తులసిబాబు విచారణ

AP News: రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ మీల్స్.. ఎవరెవరి కంటే..

Updated Date - Jan 03 , 2025 | 10:21 AM