Tragedy: చెరువులో జారి పడి టెన్త్ విద్యార్థి మృతి..
ABN , Publish Date - Mar 27 , 2025 | 10:33 AM
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి చెరువులోకి దిగి జారీపోయి మృతి చెందాడు. గురువారం బీసీ హాస్టల్‌లో నీరు లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు ఉదయం చెరువుకు వెళ్లారు. ఓ విద్యార్థి చెరువులోకి దిగి జారిపోవడంతో ఈ ఘటన జరిగింది.

గుంటూరు: జిల్లాలో దారుణం (Tragedy) జరిగింది. వట్టి చెరుకూరులో చెరువు (Pond)లో దిగి పదో తరగతి విద్యార్థి (10th Sutdent) కిషోర్ (Kishor) మృతి చెందాడు. బీసీ వసతి గృహం (BC Hostel)లో నీరు లేకపోవడం (Water Shortage)తో నీటి కోసం గురువారం ఉదయం చెరువుకు ముగ్గురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఓ విద్యార్థి చెరువులోకి జారి పోయాడు. ఆ విద్యార్దిని కాపాడేందుకు తోటి విద్యార్థులు ప్రయత్నించారు. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఆ ఇద్దరు విద్యార్థులు కూడా చెరువులోకి జారీపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరు విద్యార్థులను కాపాడారు. కాగా కిషోర్ అనే విద్యార్థి చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. కిషోర్‌ది వెల్దుర్తి మండలం, గంగలకుంట గ్రామం. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్జి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Also Read..: కుప్పకూలిన భవనం ఘటన.. చికిత్స పొందుతూ మేస్త్రీ మృతి..
కాగా ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టెన్త్ పరీక్ష రాసి ఇంటికి వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి (మార్చి 21) నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు మొదలవగా.. ఈరోజు (మార్చి 22న) సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే.. ప్రభాతి ఛత్రియ (16) అనే పదో తరగతి విద్యార్థి పరీక్ష ముగించుకుని.. తన సోదరుడు సుమన్ ఛత్రియతో కలిసి ఇంటికి బయలుదేరింది. గచ్చిబౌలి నుంచి లింగపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ మీద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభాతి ఛత్రియ మీది నుంచి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు వెళ్లటంతో.. విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కాగా.. విద్యార్థిని సోదరుడు సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు గాయపడిన సుమన్ ఛత్రియను స్థానిక ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాశీ విశ్వనాథ దర్శనానికి ముందు సందర్శించాల్సిన ఆలయాలు
For More AP News and Telugu News