Share News

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:20 PM

Vijay Kumar ACB Questioning: గత ప్రభుత్వ హాయంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌ కుమార్ రెండో రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మొదటి రోజు విచారణకు సహకరించకపోవడంతో మరోసారి విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు ఆదేశించారు.

  Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Vijay Kumar ACB Questioning

గుంటూరు, ఏప్రిల్ 3: ఏపీ ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి (Former AP I&PR Commissioner Vijay Kumar Reddy) రెండో రోజు ఏసీబీ (ACB) విచారణకు హాజరయ్యారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుల మేరకు నిన్న (బుధవారం) గుంటూరులోని ఏసీబీ రిజనల్ కార్యాలయానికి విచారణకు వచ్చారు విజయ్ కుమార్. దాదాపు ఎనిమిది గంటల పాటు ఏసీబీ విచారణ కొనసాగింది. అయితే నిన్నటి విచారణకు విజయ్‌కు మార్ రెడ్డి సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మరోసారి విచారణకు పిలిచారు. దీంతో ఇవాళ ఉదయం 10:30 గంటల తర్వాత రెండో రోజు విచారణకు విజయ్ కుమార్ హాజరయ్యారు.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసి విజయ్ కుమార్ రెడ్డి.. మొత్తం రూ.859 కోట్ల రూపాయలను ప్రభుత్వ ప్రకటన రూపంలో ఖర్చు చేయగా.. వాటిలో 50 శాతం వరకు కేవలం సాక్షి పత్రిక, సాక్షి మీడియాకు మాత్రమే కేటాయించారు. అంతే కాకుండా మిగిలిన 50 శాతం కూడా అత్యధిక శాతం వైసీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా సంస్థలకే కట్టబెట్టారు. ఈ కేసులోనే విజయ్‌కుమార్‌ను ఏసీబీ విచారిస్తోంది. 2019 - 24 మధ్యకాలంలో 859 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. అప్పటి ఐ అండ్ పీఆర్ సమాచార కమిషనర్ విజయ్‌ కుమార్ నోటీసులు ఇచ్చారు.

Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి


ఎవరి ప్రోద్భలంతో చేశారు.. ఎందుకు చేశారు అనే దాన్ని ఏసీబీ కూపీ లాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి విజయ్ కుమార్‌ను నిన్న కొన్ని ప్రశ్నలు అడుగగా.. ఆయన మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉండటంతో గత ప్రభుత్వంలో సాక్షి మీడియాకు, వైసీపీ అనుకూల మీడియాకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల రికార్డులను కూడా ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు. అయినప్పటికీ విజయ్ కుమార్ ఎలాంటి సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది. దీంతో ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా విజయ్‌ కుమార్‌కు ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయం విచారణ నిమిత్తం ఏసీబీ ఆఫీసుకు వచ్చారు విజయ కుమార్. వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకు ఎందుకు దోచిపెట్టారు.. ఎవరి ప్రోద్భలంతో, ఎవరు ఆదేశాల మేరకు ప్రభుత్వ ధనాన్ని దాదాదత్తం చేశారని విజయ్‌ కుమార్‌ను ప్రశ్నించి.. ఆయన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు. అయితే ఏసీబీ అడిగిన ప్రశ్నలకు విజయ్ కుమార్ ఎంత మేరకు సమాధానాలు ఇస్తారో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 01:29 PM