Share News

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

ABN , Publish Date - Mar 24 , 2025 | 06:38 PM

Mayor Suresh Babu: కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో .. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది.

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
kadapa Mayor Suresh Babu

కడప, మార్చి 24: పలు ఆరోపణల నేపథ్యంలో కడప మేయర్, వైసీపీ నేత సురేశ్ బాబుపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో మేయర్ సురేశ్ బాబుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ షోకాజ్ నోటీసులపై సమాధానం చెప్పాలంటూ మేయర్ సురేష్ బాబును టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ క్రమంలో సోమవారం విలేకర్ల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.

కడప నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్ల ఉన్నాయి. వాటిలో 49 డివిజన్లు వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నగరంలో మేయర్ సురేష్ బాబు తన ఇష్టా రీతిగా కాంట్రాక్ట్‌లు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా.. తన కుటుంబ సభ్యులకు సైతం కాంట్రాక్ట్‌లు కేటాయించినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.


అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం కడప ఎమ్మెల్యే, టీడీపీ నేత మాధవి రెడ్డి.. కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న అవినీతిని ఎండగడుతూన్నారు. ఆ క్రమంలో మేయర్ సురేష్ బాబు వ్యవహారిస్తున్న తీరుతోపాటు ఆయన అవినీతిని సైతం వెలుగులోకి తీసుకు వస్తున్నారు. అందులోభాగంగా ఆయన తన కుటుంబ సభ్యులకు సైతం కాంట్రాక్ట్ కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి.


వీటిపై విజిలెన్స్ విచారణ జరపాలంటూ రాష్ట్రప్రభుత్వానికి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణలో మేయర్ అవినీతి వ్యవహారం బట్టబయిలు అంది. ఈ నేపథ్యంలో మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 07:48 PM