Penukonda: కియ కార్ల రవాణా కోసం గూడ్స్ రైలు ప్రారంభం
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:47 AM
కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును కియ ప్రతినిధులు,

పెనుకొండ రూరల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును కియ ప్రతినిధులు, రైల్వే అధికారులు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కియ ఇండియా సీనియర్ వైస్ ప్రిసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హార్దిప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగంలో దిగ్గజమైన కియ పరిశ్రమ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎస్‌యూవీ కార్లను తరలించడానికి డబుల్ డెక్కర్ గూడ్స్ రైలును ప్రారంభించామని తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ గూడ్స్ రైలులో ఒక్కసారికి 264 కార్లను తరలించగలమని తెలిపారు.