Files Missing: దుర్గగుడిలో 8 కీలక ఫైళ్ళు గల్లంతు..
ABN , Publish Date - Mar 02 , 2025 | 11:39 AM
దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతు అయ్యాయి. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో వాటికి సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు.

విజయవాడ: దుర్గగుడి (Durgagudi) దేవస్థానం (Temple)లో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు (Key Files Missing) అయినట్లు అధికారులు గుర్తించారు. గతంలో పని చేసిన ఈవోల (EOs) నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గళ్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ (K, Ramachandra Mohan) సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫైళ్ల గల్లంతు విషయంపై సబంధిత అధికారుల నుంచి ఈవో వివరాలు ఆరా తీశారు.
ఈ వార్త కూడా చదవండి..
8 మంది మృత దేహాలకు DNA టెస్టులు
కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతు అయినట్లు గుర్తించారు. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో వాటికి సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు. ఉద్యోగులు సయితం సరైన సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. మాయమైన ఫైళ్ల గురించి గతంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు సమాధానం చెప్పాలని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి హెడ్ ఆఫీసు నుంచి ఫైళ్లు తెప్పించుకుని కోర్టులో కౌంటర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఫైళ్లకు సంబంధించిన వివరాలను ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఉద్యోగులను అడగ్గా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు మౌనం దాల్చడంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసిన ఈవోలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫైళ్లు మాయమయ్యాయి. ఈ ఫైలింగ్ చేయకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుత అధికారులు అంటున్నారు. ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ ఒకరే కావడంతో ఫైళ్ల గల్లంతుకు కారణమైనవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆశా వర్కర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
డీఐజీ సునీల్ నాయక్‌కు నోటీసులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News