AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ABN , Publish Date - Feb 22 , 2025 | 11:15 AM
AP Capital: రాజధాని అమరావతి పనుల ప్రారంభంపై కీలక ప్రకటన వెలువడింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి, ఫిబ్రవరి 22: రాజధాని అమరావతి (AP Capital) పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్న వేళ కీలక అప్టేట్ వచ్చేసింది. మార్చి 15 నుంచి రాజధాని పనులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30 వేల మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యం అయ్యింది. టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 62 పనులకు సీఆర్డీఎ, ఏడిసీ టెండర్లను పిలిచింది. సుమారు 40 వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్య ప్రాజెక్టు తీసుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించారు. తరువాత చెన్నై ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతిలో సెక్రటేరియెట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాల పటిష్టతపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి డోకా లేదంటూ ఐఐటీ బృందం నివేదిక ఇచ్చింది.
వామ్మో.. ఇదేం పని అంకుల్.. ఇలాగేనా చేసేది..!
అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు పటిష్టంగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. దాదాపు 40 వేల కోట్లకు సంబంధించి 62 పనులపై మార్చి 15 నుంచే శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన 11 పనులకు త్వరలో టెడర్లను పూర్తి చేసి రెండున్నరేళ్లలో అమరావతి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అమరావతిలో పేరుకుపోయిన జంగిల్ క్లియరెన్స్‌ను పూర్తిస్థాయిలో తొలగించేశారు. దీంతో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శరవేగంగా పనులు ముందుకు సాగుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి...
ఇండో-పాక్ మ్యాచ్.. ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వైరల్
Read Latest AP News And Telugu News