AP News: సావిత్రి బాయి పూలేకు చంద్రబాబు, లోకేష్ నివాళులు
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:29 PM
Andhrapradesh: స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి, జనవరి 3: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి సావిత్రిబాయి పూలే (savitri bai phule) 194 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu), విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయం. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం తెలిసిందే. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఘననివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ధీశాలి సావిత్రిబాయి: మంత్రి లోకేష్
సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి అయిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి అని అన్నారు. ‘‘‘మనకున్నది ఒకే ఒక శత్రువు, ఆ శత్రువే అజ్ఞానం. విద్యావంతులమై ఆ శత్రువుని తుదముట్టించడమే మన లక్ష్యం’ అని నినదించారని తెలిపారు. మహిళల జీవితాల్లో విప్లవాత్మకమైన చైతన్యం తీసుకువచ్చిన ధీశాలి సావిత్రిబాయి అని కొనియాడారు. తాను అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు శ్రమించారని తెలిపారు. సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి స్ఫూర్తిని కొనసాగించడమే మనం అర్పించే ఘన నివాళి అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. వేగం తెలిస్తే షాక్..
రికార్డు అమ్మకాలు.. ఒక్కరోజే రూ.9 కోట్ల మద్యం తాగేశారు
Read Latest AP News And Telugu news