AP Assembly: 20 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:17 AM
శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సోమవారమే శ్రీకారం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు 20 రోజులపాటు జరుగుతాయి. అదే సమయంలో... శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Sessions) సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో (Governor Abdul Nazir speech) ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు 20 రోజుల (20 Days) పాటు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో పాటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలకు అనుమతి లేదని.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేవారు నేరుగా సీఎంవోకే వెళ్లాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) కీలక ఆదేశాల (Key Instructions)జారీ చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు..
ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఈ రోజు సభకు రావాలని నిండయించినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి తదనంతర కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మంగళ, బుధవారం కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని గతంలో ప్రకటించిన జగన్.. మళ్ళీ ప్లేట్ మార్చి సభకు ఈ రోజు హాజరుకావాలని నిర్ణయించారు. ఏ సభ్యుడైనా సభకు 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే..
ఎమ్మెల్యే జగన్ తమ సభ్యులతో సభకు వస్తోంది ప్రజాసమస్యలపై చర్చకు కాదని.. సభ్యత్వాన్ని కాపాడుకోవడానికేనని అధికర పక్షం అంటోంది. 60 రోజులు వరుసగా సభకు హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు స్పీకర్‌కు ఉన్నట్టు నిబంధనలు చెబుతున్నాయి. ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దు చేయవచ్చు. మరోవైపు అధికార టీడీపీ సభ్యులు అందరూ ఈసారి నేరుగా సభకు వస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో ఈసారి వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహనికి నివాళులు అర్పించే కార్యక్రమం రద్దు చేశారు.
గవర్నర్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్
కాగా సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 9. 45 గంటలకు అసెంబ్లీకి రానున్నారు. ఉభయసభల నుద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ కు గార్డ్ ఆఫ్ ఆనర్ తరువాత ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతం పలకనున్నారు. సిఎంతో పాటు గవర్నర్‌కు అసెంబ్లీ వద్ద మండలి ఛైర్మన్ , స్పీకర్, సీఎస్, సెక్రటరీ జనరల్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అనంతరం అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారం నాటికి వాయిదా పడుతుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలి.. అనేదానిపై అజెండాను సిద్ధం చేయనుంది.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తారు. మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్‌లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్‌లతో పాస్‌లు జారీ చేస్తారు. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లకు అనుమతి.; అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి.; అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి.; మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తారు. శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ సిబ్బందికి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News