AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:05 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గడిచిన ఆరు నెలల పాలన రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం (Cabinet Meeting) కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెలపనుంది. ఈ పెట్టుబడులు వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి అమోదం తెలపనుంది. దీని వలన 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ. 88,747 కోట్ల ఆదాయం రానుంది.. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది.
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్..
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడులకు అమోదం తెలపనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిలకు క్యాబినెట్ అమోదం తెలపనుంది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది..దీనికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది..
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి అమోదిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు.. వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గడిచిన ఆరు నెలల పాలన రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫామెన్స్ రిపోర్టులను తీసుకున్న సీఎం... వాటి పైన, తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News