Share News

CM Chandrababu: సినిమా ఇండస్ట్రీపై చంద్రబాబు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:12 PM

Andhrapradesh: నాలుగవ సారి సీఎం ఆయ్యాక కొత్త అనుభవం ఎదురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎందుకంటే లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుందని తెలిపారు. అధికారులు అందరికీ చాలా వింత అనుభవాలు కలిగాయన్నారు. చాలామందిని లోతుగా ముంచేశారని విమర్శించారు. వ్యవస్థల విధ్వంసం జరిగాయన్నారు.

CM Chandrababu: సినిమా ఇండస్ట్రీపై చంద్రబాబు హాట్ కామెంట్స్
AP CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 1: 2024 చాలా హిస్టారికల్ ఇయర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై (Former CM YS Jagan) మరోసారి విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాకముందు ప్రజలకు బాగా ఇబ్బంది కలిగిందని.. దీంతో జనం నచ్చిన విధంగా తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆరు నెలల్లో జనానికి ఒక హోప్ వచ్చిందన్నారు. తనకు నాలుగవ సారి సీఎం ఆయ్యాక కొత్త అనుభవం ఎదురైందన్నారు. ఎందుకంటే లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుందని తెలిపారు. అధికారులు అందరికీ చాలా వింత అనుభవాలు కలిగాయన్నారు. చాలామందిని లోతుగా ముంచేశారని విమర్శించారు. వ్యవస్థల విధ్వంసం జరిగాయన్నారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అన్ని డ్రా చేశారన్నారు. ‘‘అమరావతికి చిక్కుముడులు వేశాడు జగన్.. నేను వాటిని విప్పదీసి ట్రాక్‌లో పెట్టాను. పోలవరాన్ని కూడా ట్రాక్‌లోకి తీసుకువచ్చాను. ఇపుడిప్పుడే ట్రాక్‌లో పెడుతున్నాను. అమరావతికి డబ్బులు తీసుకువచ్చాను. పోలవరంను కూడా త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.


సినిమాలపై...

అలాగే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై, సినిమాలపై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడుగగా సీఎం ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సినిమాలకు సంబంధించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు హైదరాబాద్ ఇప్పుడు హబ్‌గా మారిందని.. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సినిమాకు బాగా పెరిగిందన్నారు. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలని.. మనకు ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

డ్రెస్సింగ్ రూమ్‌ ఫైట్.. గంభీర్ సీరియస్


షెల్టర్ కోసమే వారి రాక..

ఏ రాష్ట్రంలో కూడా 6 నెలల్లో ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు రాలేదన్నారు. జగన్ సీపీఎస్ అమలు చేయలేదని, తనకు తెలియక హామీ ఇచ్చాను అని చెప్పారని విమర్శించారు. మద్య నిషేధం వంటి పలు హామీలు అమలు చేయలేదన్నారు. మొదటిసారి ఏపీ చీఫ్ సెక్రటరీగా బీసీకి ఇచ్చానన్నారు. ‘‘మా పార్టీ ప్రెసిడెంట్ బీసీ, కేంద్ర మంత్రి బీసీ ... నేను మాత్రమే ఇచ్చాను. సోషల్ రీ ఇంజనీరింగ్ నేను చేస్తున్నాను. చీఫ్ సెక్రటరీకి కాలిబర్, బీసీ రెండు విజయానందకు అర్హతలు. వైసీపీలో ఉన్నవారు షెల్టర్ తీసుకోవడానికి ఈ మూడు పార్టీల్లోకి వస్తున్నారు. దీనిపై మూడు పార్టీలలో చర్చ జరుగుతుంది. సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం’’ అని తెలిపారు. పార్టీ సభ్యత్వం 94 లక్షలకు చేరిందని.. టీడీపీ కేడర్‌లో హోప్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. వాళ్ళ హోప్స్‌కు రీచ్ కావాలన్నారు. ‘‘గతంలో టీడీపీ నేతలను హతమార్చారు.. జగన్ హయాంలో మా పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. అందరినీ మేము చాలా వరకు సర్దుబాటు చేస్తున్నాను. అందరికీ పదవులు ఇవ్వలేం కదా. ఈ సారి జాగ్రత్తగా ఉన్నాము... అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. నేను సభ్యత్వం, పదవులు పంపిణీ మీద అన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. నా ఓన్ మెకానిజమ్ నాకు ఉంది... అందుకే ప్రతి విషయం క్రాస్ చేసుకుంటున్నాను. గంతలోలా నేను లేను... అన్ని విషయాలు నేను చూసుకుంటున్నాను’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


శుభాకాంక్షల వెల్లువ

మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును పలు శాఖల అధిపతులు, అనేక మంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎంను సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు కలిసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబును చూసేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.


సీఎంకు ఎన్జీవో, జేఏసీ నేతల వినతలు..

chandrababu-ngos.jpg

అలాగే సీఎంను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, నూతన ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్, జేఏసీ సెక్రటరీ జనరల్ యూటీఎఫ్ కార్యదర్శి ప్రసాద్, ఎన్జీవో నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. అనంతరం పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజిఎల్ఐ, సరెండర్ లీవ్‌లు పెండింగ్ బకాయిలు, పీఆర్సీ కమిటీ నియామకం, 62 సంవత్సరాల పదవి విరమణ పెంపు, ఎమ్‌పీహెచ్‌ఏ తొలగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రికి వివరించి ఎన్జీవో, జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు.


ఇవి కూడా చదవండి..

ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 01 , 2025 | 03:25 PM