Share News

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:37 PM

Kasireddy shock AP High Court: మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది ధర్మాసనం.

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Kasireddy shock AP High Court

అమరావతి, ఏప్రిల్ 4: మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి (Kasireddy Rajashekar Reddy) ఏపీ హైకోర్టులో (AP High Court) ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా తమ ముందు హాజరుకావాలని కసిరెడ్డికి సీఐడీ (CID) నోటీసులు (సీఆర్పీసీ సెక్షన్ 160) ఇచ్చింది. అయితే సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ ఇచ్చిన నోటీసులపై జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


మరోవైపు మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిన్న (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. అయితే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. మద్యం కుంభకోణం కేసులో గత ఏడాది సెప్టెంబర్ 23న సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు.

Waqf Bill 2025: వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. మోదీ-షా స్కెచ్ వేస్తే ఇట్లుంటది


ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలూ లేవని, విచారణకు హాజరుకావాలని ఆదేశించలేదని సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున అరెస్ట్ చేస్తారనే ఆందోళన అవసరం లేదన్నారు. ఈ క్రమంలో ఈ బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఏప్రిల్ 3కు వాయిదా వేయగా.. నిన్న మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

AP High Court TTD Case: శ్రీనివాస దీక్షితులుకు ఏపీ హైకోర్ట్‌ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 01:51 PM