Share News

YS Sharmila Reddy: డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికారమే: వైఎస్ షర్మిల..

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:57 PM

పార్లమెంట్‍లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించే కుట్ర బీజేపీ చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని చెప్పారు.

YS Sharmila Reddy: డీలిమిటేషన్ అంటే దక్షిణాది రాష్ట్రాలపై ప్రతికారమే: వైఎస్ షర్మిల..
APCC President Sharmila

విజయవాడ: నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) స్పందించారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ(BJP) ప్రతికారం తీర్చుకోవాలని చూస్తోందంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం లేనందునే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‍పై బీజేపీ ఏకపక్షంగా వ్యవహరించకుండా అఖిలపక్షం (All Party Meeting) ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. "పార్లమెంట్‍లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గించే కుట్ర బీజేపీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డన్న చెప్పిన మాటలు అక్షర సత్యం. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం అంటే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడమే. 1971 తర్వాత సౌత్ కంటే ఉత్తర భారతదేశంలోనే అత్యధికంగా జనాభా పెరిగింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్లకు జనాభా పెరిగింది.


పెరిగే స్థానాలు కలుపుకుంటే.. రెండు రాష్ట్రాల నుంచే ఏకంగా 222 ఎంపీలు లోక్ సభలో ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్ సంఖ్య 12 మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోంది.


డీలిమిటేషన్‍పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు. దాటవేసే ధోరణి అవలభించడం అన్యాయం. బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే.. చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని గ్రహించాలి. డీలిమిటేషన్‍పై చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని" అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..

Chicken Tikka masala Cake: మీరెప్పుడైనా చికెన్ టిక్కా మసాలా కేక్ తిన్నారా.. అయితే మీ కోసమే..

Updated Date - Mar 13 , 2025 | 07:29 PM