Share News

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:14 AM

CM Chandrababu On DSC: ఏపీ మెగా డీఎస్సీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. డీఎస్సీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు.

 CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
CM Chandrababu On DSC

అమరావతి, మార్చి 25: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గుడ్‌న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీపై (Mega DSC) ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే నెల (ఏప్రిల్) మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.


చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని.. అందుకే ప్రజలు కూటమికి తిరుగులేని తీర్పు ఇచ్చారన్నారు. ఐదేళ్లకు ఒకసారి ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని అందరం కలిసి గాడిలో పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని తెలిపారు. కలెక్టర్లు దర్పం ప్రదర్శించడం కాదని.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదన్నారు. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని అన్నారు. అప్పులు తెస్తే ఎంతకాలం కొనసాగిస్తామని ప్రశ్నించారు.

Rangarajan: నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమలేశుడే


9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా రూ.4 వేలు పింఛన్‌ లేదు.. మనం ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పింఛన్‌ రూ.6 వేలకు పెంచామని చెప్పుకొచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని అన్నారు. ప్రపంచంలోనే బెస్ట్‌ మోడల్‌తో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్న క్యాంటీన్లతో రూ.5కే భోజనం అందిస్తున్నామని.. దీపం-2 కింద ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. చెత్త పన్నును తొలగించామని తెలిపారు. 2027కు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించారు. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Crime News: మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 11:24 AM