Share News

Collectors Conference: ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:50 AM

పత్రికలో వచ్చిన వార్తను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని... విమర్శలు చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు.

Collectors Conference: ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన
CM Chandrababu Naidu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన రెండవ రోజు బుధవారం ఏపీ సచివాలయం (AP Secretariat)లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ (Collectors Conference) జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ఎమ్మెల్యే కూనంనేని (MLA Koonamneni)చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో టూరిజం (Tourism)పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. ‘ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు... ఉన్నదంతా టూరిజమే’ అని ఆనాడు చంద్రబాబు అనేవారు అంటూ ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు ‘నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం’ అంటూ తెలంగాణ సభలో ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యానించారు.

Also Read..: ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు


పత్రికలో వచ్చిన ఆ వార్తను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు. ఏ ఇజం లేదు అని తాను నాడు అంటే కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని... విమర్శలు చేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ ఇప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. తాను చేసిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అంత సమయం లేదని...త్వరగా ప్రాజెక్టులు తెచ్చి... ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని అన్నారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఎకానమీ పెరిగి...ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాథి కల్పించే రంగం టూరిజం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందన్న చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కాగా రెండవ రోజు బుధవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మిగిలిన జిల్లాల డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అనంతరం ఐదు నిమిషాల పాటు చర్చించనున్నారు. తర్వాత జోనల్ ఇన్చార్జి ఆఫీసర్స్‌కు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆయా ప్రజెంటేషన్‌లపై సూచనలు, కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తారు. సీసీఎల్ఏ కమిషనర్ చేతుల మీదుగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. అనంతరం సీనియర్ కలెక్టర్ ఓట్ ఆఫ్ థాంక్స్ తెలియజేయనున్నారు.


సుత్తి లేకుండా సూటిగా చెప్పండి...

కాగా తొలిరోజు మంగళవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో సుదీర్ఘ ప్రసంగాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన సీఎం చంద్రబాబు, సమయపాలనపై దృష్టి సారించారు. ప్రతి శాఖ ప్రజెంటేషన్లు ఐదారు స్లైడ్‌లకు పరిమితం చేసి, అజెండాకే కట్టుబడి చర్చలు సాగించాలని స్పష్టంగా సూచించారు. సుదీర్ఘ చర్చలు, అంతూపొంతూ లేని ప్రసంగాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. టైమ్‌ అంటే టైమే. ఒక్క నిమిషం ఎక్కువ మాట్లాడినా గణగణ అంటూ బెల్‌ మోగాల్సిందే. ‘ఇప్పటివరకూ ఏం చేశారు? ఇకపై ఏం చేయబోతున్నారో సుత్తి లేకుండా సూటిగా చెప్పండి...’ అని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. మంగళవారం మొదలైన జిల్లా కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో ప్రభుత్వం కీలక మార్పును తీసుకొచ్చింది. ఏ విషయంపైనా సుదీర్ఘంగా మాట్లాడకుండా, అనవసరమైన చర్చలు లేకుండా అజెండాకే కట్టుబడి, నిర్దిష్ట సమయం పాటించేలా చంద్రబాబు తనదైన మార్పును ఆచరణలో చూపించారు. గతేడాది డిసెంబరులో జరిగిన కలెక్టర్ల సదస్సు సుదీర్ఘంగా సాగిన సంగతి తెలిసిందే. ఉదయం 10 నుంచి రాత్రి 11.45 గంటల వరకూ ఏకధాటిగా సాగిన ఆ సమావేశంలో అజెండా కూడా సరిగ్గా పాటించలేదు. సగటున ఒక్కో శాఖ రెండు గంటల చొప్పున ప్రజెంటేషన్‌ ఇచ్చి సమావేశాన్ని లక్ష్యానికి భిన్నంగా తీసుకెళ్లారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం స్పందించారు. ఇకపై సుదీర్ఘ చర్చలు, ప్రజెంటేషన్లు ఉండవని, సమయ పాలనను పక్కగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం నాటి సమావేశంలో దీన్ని అక్షరాలా అమలు చేసి చూపించారు. అజెండా తయారీ నుంచి అన్నీ క్లుప్తంగా ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో శాఖ ఐదారు స్లైడ్‌లకు మించకుండా ప్రజెంటేషన్‌లో ఉండేలా కట్టడి చేశారు. సమావేశం ప్రారంభంలోనూ, ఆయా శాఖలపై చర్చల సందర్భంలోనూ సమయపాలన గురించి సీఎం పదేపదే గుర్తుచేశారు, తన ప్రసంగం కూడా చాలా క్లుప్తంగా ఉండేలా జాగ్ర త్తపడ్డారు. గంటసేపు మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి 40 నిమిషాల్లోనే ముగించారు. ‘సూటిగా మాట్లాడాలి? మీకేం కావాలో స్పష్టంగా చెప్పాలి?’ అని చంద్రబాబు పలుమార్లు కార్యదర్శులకు చురకలంటించా రు. ఈసారి కలెక్టర్లతో మాట్లాడించే ప్రయత్నం చేశారు.

కలెక్టర్ల పనితీరును ప్రత్యక్షంగా సమీక్షిస్తా

ఈ సమావేశం ఆద్యంతం చంద్రబాబు ఉత్సాహంగా, హుషారుగా కనిపించారు. రెవెన్యూ, వాతావరణ పరిస్థితులు, సంక్షేమం, శాంతిభద్రతలు తదితర అంశాలపై సూటిగా ప్రశ్నలు అడిగారు. అజెండాలోని పలు అంశా ల్లో లోపాలను ఎత్తిచూపి సంబంధిత కార్యదర్శులను ప్రశ్నించారు. ఏసీ గదుల్లో కూర్చొంటే పనులు కావని, ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ‘ఏజెన్సీలో ఆదాయం తీసుకొచ్చే వాణిజ్య పంటలను సాగు చేసేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి? ’ అని సీఎం ప్రశ్నించారు. స్ట్రాబెర్రీ, అవకాడో, జాక్‌ ఫ్రూట్‌ పంటల సాగు, ధరలు, ఆదాయం గురించి వివరాలు కోరగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఇకపై కలెక్టర్ల పనితీరును ప్రత్యక్షంగా సమీక్షిస్తానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత

రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు

ఏపీ మద్యం స్కాంపై అమిత్ షా ఆరా

For More AP News and Telugu News

Updated Date - Mar 26 , 2025 | 11:50 AM