Share News

CM Chandrababu Orders: వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:52 PM

CM Chandrababu Orders: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu Orders: వారికి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు
CM Chandrababu Orders

అమరావతి, మార్చి 26: రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సమావేశం (Collectors Meeting) జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అధికారాలు డెలిగేట్ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా వారి విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. దీనిపై సంబంధించిన ఆదేశాలను హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో జారీ చేయాలని తెలిపారు. కొత్త జిల్లాలలో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.


పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లోనూ ప్రత్యేకించి కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే


రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నామని సీఎం అన్నారు. పేదరిక నిర్మూలనకు సంపదను సృష్టించే టూరిజం తదితర అంశాలకే భవిష్యత్తు అంతా ప్రాధాన్యతనిస్తుందని, భౌతిక వాదమే వస్తుందని అన్నానని.. కాబట్టి తాను చెప్పేదంతా జిల్లా కలెక్టర్లు అందరూ అర్థం చేస్తుకుని క్షేత్ర స్థాయిలో రియల్ టైమ్‌లో అమలుపరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏపీలో ఐదు జోన్‌లు ఉన్నాయన్నారు. జోన్-1 లో విశాఖపట్నం, జోన్-2 లో రాజమండ్రి, జోన్-3 లో రాజదాని అమరావతి, జోన్-4 లో తిరుపతి, జోన్-5 లో అనంతపురం పవర్ హబ్‌లుగా ఉన్నాయని తెలిపారు. ఆ పవర్ హబ్ల ఆధారంగా ఆయా జోన్లలోని అన్ని జిల్లాలను అభివృద్ది పర్చే విధంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అభివృద్ది ప్రణాళికలను రూపొందించి అమలుపరిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందని వెల్లడించారు.


ప్రతి ఒక్క జోన్‌కు ఒక సీనియర్ అధికారిని ఇన్‌చార్జిగా ఉంచామన్నారు. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి కూడా ఉన్నారని తెలిపారు. వీరందరూ కలిసి ఆయన జిల్లాలను, ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో సమగ్రంగా చర్చించి క్షేత్ర స్థాయిలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారుర. గ్రామాల్లోని వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే విధంగా, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని రియల్ టైమ్‌లో పరిష్కరించేందుకై వచ్చే మాసం నుంచి సీనియర్ అధికారులు అంతా గ్రామాల్లో మూడు నాలుగు రోజులు ప్యటించాలని ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 01:57 PM