Fire Accident: అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:03 AM
కృష్ణా జిల్లా: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

కృష్ణాజిల్లా: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమం (Little Lights Orphanage)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు (Students) గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అనాధాశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆశ్రమం పక్కన ఉన్న ప్రార్థన మందిరంలో ఉన్న వారు, స్థానికులు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద తప్పిన ప్రమాదం తప్పింది.
ఈ వార్త కూడా చదవండి..
నన్ను అరెస్టు చేయండి.. మంచు మనోజ్
లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మొత్తం ఎగసి పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సిబ్బంది పిల్లలను బటకు తీసుకొచ్చారు. విద్యార్థులు బటకు పరుగులు తీశారు. అయితే ఓ గదిలో ఆరుగురు విద్యార్థులు చిక్కుకు పోయారు. తలుపులు పగులగొట్టిన సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు కుంభమేళాలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మొత్తంగా ఆరు ప్రమాదాలు జరగ్గా.. తాజాగా సోమవారం మరో ప్రమాదం సంభవించింది. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకోగా.. అధికారులు వెంటనే స్పందించారు. ప్రజలందరినీ క్షేమంగా బయటకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. కాగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కోట్లాది మంది ప్రజలు వస్తున్నారు. గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News