Share News

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

ABN , Publish Date - Mar 17 , 2025 | 02:53 PM

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవకతవకలపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవమన్నారు.

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..
Cooperative banks corruption

అమరావతి, మార్చి 17: సహకార బ్యాంకుల్లో అవకతవకలపై శాసనసభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. సుమారు 5వే లకోట్ల రూపాయలు మేర సహకార బ్యాంకుల్లో దోపిడీ జరిగిందని తెలిపారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే రూ.600 కోట్ల రూపాయలు రైతుల కోసం పనిచేయాల్సిన బ్యాంకు ద్వారా దోచేశారన్నారు. ఆప్కాబ్, డీసీసీబీ నుంచి ఆర్గనైజ్‌డ్‌గా జరిగిన కుంభకోణం ఇది అని అన్నారు. పైనుంచి కింది దాకా అధికారంలో ఉన్న వాళ్ళ ఒత్తిడి, పర్యవేక్షణతోనే జరిగిందని తెలిపారు. రైతుల పేరున బోగస్ రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. డీసీసీబీ స్ధాయిలో త్రీ మ్యాన్ కమిటీ నియమించుకొని అయిదేళ్లలో కాంట్రాక్ట్ బేసిస్‌పై 50 మందిని నియమించుకున్నారని తెలిపారు. వాళ్లకు సంబంధించిన వారు సెంట్రల్ బ్యాంకులో తిస్ట వేసి రివెన్యూ అధికారులతో కుమ్మక్కై కొన్ని బ్రాంచ్‌లపై ఒత్తిడి చేశారన్నారు. రెవెన్యూ అధికారులు, డీసీసీబీ అధికారులు కొల్యూడ్ అయి వందల కోట్లు దోచేశారని మండిపడ్డారు.


డ్వాక్రా సంఘాల పేరు మీద 3 మ్యాన్ కమిటీ మేనేజ్మెంట్‌‌లు ఒత్తిడి చేసి ప్రైవేటు బ్యాంకుల నుంచి సెంట్రల్ బ్యాంకులకే మార్చారన్నారు. రూ.200 కోట్లు ఈ విధంగా తినేశారని.... 2 కోట్ల రూపాయల కింద డ్వాక్రా సంఘాలకు లోన్ ఇచ్చి ప్రభుత్వం మారాక ఆయనే డబ్బులు కడుతున్నారన్నారు. పొన్నూరు బ్రాంచ్‌లో వడ్డీ మాఫీ కింద పడే డబ్బులను రెండు కోట్లు బదిలీ చేసుకొని ఇల్లు కట్టి ఇప్పుడు తిరిగి కడుతున్నారన్నారు. వారు ఇప్పటికీ అదే బ్యాంకుల్లో అధికారులుగా ఉన్నారన్నారు. గోడౌన్ల పేర్ల మీద ఆప్కాబ్ నుంచి పీఏసీఎస్ సొసైటీలపై ఒత్తిడి చేసి స్మశానాలలో కడుతున్నారని మండిపడ్డారు. లేఅవుట్ సైట్లలో, ట్యాంకు పోరంబోకులపై ఈ గోడౌన్లు కడుతున్నారన్నారు. బుణం పీఏసీఎస్ సోసైటీ నుంచి తీసుకొని గోడౌన్లను ఎక్కడ బడితే అక్కడ కట్టారన్నారు. సోసైటీ స్ధలం కాని దానిలో ఎలా గోడౌన్లు కడతారని ప్రశ్నించారు. గతంలో స్కూళ్ళ స్థలాల్లో సచివాలయాలు ఎలా కడతారని కూల్చమని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఆప్కాబ్ ఎండీలు, డీసీసీబి ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్


త్రీ మ్యాన్ కమిటీ వస్తే అడ్డగోలుగా దోచుకోమని చెప్పడం లేదు అనే విషయం గుర్తించాలన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రిపోర్టు ప్రకారం అమూల్ కోసం జగనన్న పాలవెల్లువ పేరు మీద రూ.11 కోట్లు బుణాలు, జగనన్న తోడుకు రూ.20 కోట్లు, ఫిష్ ఆంధ్రాకు , వ్యవసాయ పర్మిట్‌లకు ఎలా బుణాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం మారాక రెండు నెలల వరకూ ఎంక్వైరీ వేయలేదన్నారు. రైతులు సోమ్మును దోచుకొని దిగజారే పరిస్ధితికి గత ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్ర స్ధాయిలో ఉన్నత సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేయించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.


అవినీతి వాస్తవం.. చర్యలు తప్పవు: మంత్రి అచ్చెన్న

2019 నుంచి 24 వరకు డీసీసీబీలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనికి కారణం డీసీసీబీలలో ఓ విధానం లెక్క లేదన్నారు. ఓ జీవో ఇచ్చి సెక్రటరీలు, డీసీసీబీలను అందరిని బదిలీ చేయాలని వెళ్లామన్నారు. హైకోర్టు దాన్నిస్టే చేశారని.. స్టే వెకేట్ చేయించి ముందుకు వెళతామన్నారు. 9 నెలల్లో వచ్చిన ఫిర్యాదులు అన్నింటిపై వెంటనే యాక్షన్‌కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభ్యులు చెప్పిన ప్రతీ విషయంపై ఒక ప్రోసీజర్ ప్రకారం ఆఫీసర్లతో ఓ ఎంక్వైరీ వేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదని.. దాన్ని అంగీకరిస్తున్నామన్నారు. డీసీసీబీ బ్యాంకులకు సంబంధంలేని విషయాలను ఇంక్లూడ్ చేశారన్నారు. అధికారుల ఎంక్వైరీ రిపోర్టు వచ్చిందని... దాని ఆధారంగా మరో ఎంక్వైరీ వేశామన్నారు. ఆ రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. పాతవాళ్ళను 6,7 ని నాబార్డుకు చెప్పి తొలగించి కొత్తవారిని వేయించామన్నారు. ఓ టైం బౌండ్ ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. కింది స్ధాయిలో చర్యలు కాదని.. పై స్ధాయిలో నుంచి కింది స్ధాయి వరకూ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అవసరం అయితే ముఖ్యమంత్రి తో మాట్లాడి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పీఏసీఎస్ లు, డీసీసీబీలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్‌తో ఈ బ్యాంకులను కూడా డిజిటలైజ్ పూర్తి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Jathvani False Cases: సీఎం, హోంమినిస్టర్.. న్యాయం చేయండి ప్లీజ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 02:53 PM