Share News

Narayana: క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి నారాయణ

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:49 AM

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామని చెప్పారు. దేశంలోని10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు.

Narayana:  క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి నారాయణ

విజయవాడ: రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) శుక్రవారం విజయవాడలో క్రెడాయ్ ప్రాపర్టీ షో (CREDAI, Property Show)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని (MP Keshineni Chinni), ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్ (Gadde Rammohan), బోడే ప్రసాద్ (Bode Prasad) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ (Real estate) రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామని చెప్పారు. దేశంలోని10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు. లే అవుట్‌లలో రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించామన్నారు.15 మీటర్లలోపు భవనాలు నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేకుండా లైసెన్సెడ్ సర్వేయర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నామని, ప్రాపర్టీ షోలో నిర్వహణ ద్వారా కొనుగోలుదారులకు అవగాహన వస్తుందన్నారు. ప్రతి ఏటా రెండు సార్లు రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో సమావేశం అవుతానని, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

శ్రీ మహావిష్ణు రూపంలో భద్రాద్రి రామయ్య..


కాగా భ‌వ‌న నిర్మాణాలు, లేఅవుట్ల అనుమ‌తుల‌కు సంబంధించి నిబంధనలను సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ - 2017లో సవరణలు చేస్తూ వేర్వేరుగా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్కర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు.


సంక్రాంతి కానుక‌గా బిల్డర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్రజ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గ‌తంలో ఉన్న12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్లకు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశామని చెప్పారు. 500 చ‌.మీ. పైబ‌డిన స్థలాలు, నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్‌లు తొల‌గిస్తూ జీవో జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న స్థలాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీ.స‌ర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధ‌న తొల‌గించినట్లు చెప్పారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేశామన్నారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సులభం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్‌ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేసినట్లు వివరించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోనుందని మంత్రి నారాయణ ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాయపడిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

ఢిల్లీ అసెంబ్లీ .. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..

వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 10 , 2025 | 11:49 AM