Share News

Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:13 PM

విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంకును సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత ప్రారంభించారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలను కలిశారు.

Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత
Namrata Shirodkar

విజయవాడ: పదేళ్ల కాలంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫౌండేషన్ (Mahesh Babu Foundation) ఆధ్వర్యంలో 4,500 మంది పిల్లలకు పైగా గుండె ఆపరేషన్లు చేయించినట్లు నమ్రత శిరోడ్కర్(Namrata Shirodkar) తెలిపారు. చిన్నారుల విషయంలో మహేశ్ బాబు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు నమ్రత చెప్పుకొచ్చారు. తమకు సాధ్యమైనంత వరకూ ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని మహేశ్ బాబు సతీమణి పేర్కొన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్‌లో మదర్స్ మిల్క్ బ్యాంకు(Mother's Milk Bank)ను నమ్రత ప్రారంభించారు. అనంతరం గుండె ఆపరేషన్ (Heart surgeries) చేయించుకున్న పిల్లలను కలిశారు.


ఈ సందర్భంగా ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేసినందుకు మహేశ్ బాబు ఫౌండేషన్, ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం, పిల్లల కార్డియాక్ టీమ్‌కి ధన్యవాదాలు చెప్పారు నమ్రత. అలాగే తొమ్మిది నుంచి 18 ఏళ్ల లోపు ఆడ పిల్లలంతా తప్పకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ నిధులతో మదర్స్ మిల్క్ బ్యాంకు ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తల్లి పాలు శ్రేష్టమైనవని అన్నారు. తల్లిపాలు తక్కువ ఉన్న పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టిన చిన్నారులకు, బరువు తక్కువతో పుట్టిన పిల్లలకు.. మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా పాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కింద రోటరీ తరుఫున సేవలందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యజమాన్యాన్ని నమ్రత అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు కీలక సూచనలు చేసిన మంత్రి లోకేశ్..

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Mar 16 , 2025 | 05:45 PM