Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:15 PM
Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. విచారణకు ఆదేశించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి, మార్చి 26: హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో (DGP Harish Kumar Gupta) ముఖ్యమంత్రి మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
లోకేష్ దిగ్భ్రాంతి
పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి లోకేష్ (Minister lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని.. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
హోంమంత్రి స్పందన
అలాగే పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతి ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ మరణంపై సమగ్ర విచారణకు జరపాల్సిందిగా హోంమంత్రి ఆదేశించారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవసంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
రాజమండ్రిలో ఉద్రిక్తత
మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పాస్టర్లు, క్రైస్తవులు, దళిత సంఘాలు నిరసన కొనసాగుతోంది. రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ల ఆందోళనలతో రాజమండ్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి వద్దకు భారీగా దళిత సంఘాలు,పాస్టర్లు, క్రైస్తవులు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కాగా.. హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాత్రి రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్ మార్గమధ్యలో కొంతమూరు సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజమహేంద్ర వరంలో స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని భార్యకు చెప్పి బుల్లెట్‌పై బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో రోడ్డు పక్కన చనిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌తో సహా ప్రవీణ్ రహదారి పై నుంచి కిందకు జారీపోయాడని.. ఈ క్రమంలో బుల్లెట్ ఆయనపై పడటంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కానీ ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన వారు మాత్రం అతడిని ఎవరో చంపి పడేశారని.. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉన్నాయని... రాడ్డుతో కొట్టినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతి విషయం తెలిసిన వెంటనే క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆందోళనకు దిగారు. ప్రవీణ్‌ను ఆయన ప్రత్యర్థులు ఎవరో చంపేశారంటూ నిన్న(మంగళవారం) రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద నిరసన చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..
Read Latest AP News And Telugu News