Share News

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

ABN , Publish Date - Jan 26 , 2025 | 10:15 AM

ఆంధ్రప్రదేశ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
AP Assembly

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో అసెంబ్లీ (Assembly), శాసనమండలి (Legislative Council)లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు (Republic Day Celebrations) జరిగాయి. శాసనసభలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Pathrudu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం... స్వేచ్చ, సమానత్వం, ఓటుహక్కు కల్పించిందని, సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 75 ఏళ్లలో 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, రానురాను అసెంబ్లీలో పని దినాలు తగ్గిపోతున్నాయని, బడ్జెట్ సమావేశాలు ఒకప్పుడు 45 రోజులపాటు జరిగేవని అన్నారు. ఇప్పుడు చాలా తక్కువ రోజులు నడుస్తున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. చర్చలు జరిగితేనే లోటుపాట్లు తెలిసేవని, ఏడాదిలో శాసనసభ కనీసం 75 రోజులు నడవాలన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు


84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, వారికి అవగాహన కల్పిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వచ్చే నెలలో వారికి ప్రత్యేక శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లోక్ సభ స్పీకర్, వెంకయ్య నాయుడు వంటి పెద్దల్ని రప్పించేందుకు కృషి చేస్తున్నామని, మన రాష్ట్రం అగ్రగామిన నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపిచ్చారు. ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పోలవరం పూర్తయితే రాష్ట్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఏపీలో పించన్ రూ. 4 వేలు ఇస్తుంటే... పాట్నాలో 60 ఏళ్లు దాటిన వారికి కేవలం రూ. 400 ఇస్తున్నారన్నారు. ఏపీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు.


సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

కాగా అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన భావన అని.. ఈ సినిమాలో 200 మంది కొత్త నటులు నటించారని, సినిమా అంతా ఏపీలోనే నిర్మించారన్నారు. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలకు తమ ప్రోత్సహం ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని, కుల, మతాలు, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. పేదవాడికి ఓ చదువు, లేనివాడికి ఓ చదువు అందుతుందని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని అందరూ గ్రహించాలన్నారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని, పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని మోషేన్ రాజు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్

నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..

నందమూరి అభిమానులందరికీ ఇదోక ముఖ్యమైన క్షణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 10:41 AM