Share News

Ravindra Lokesh Meeting Controversy: లోకేష్‌తో ఇప్పాల రవీంద్రరెడ్డి.. టీడీపీ సీరియస్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:56 PM

Ravindra Lokesh Meeting Controversy: మంత్రి లోకేష్‌ను ఇప్పాల రవీంద్ర రెడ్డి కలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. రవీంద్రపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Ravindra Lokesh Meeting Controversy: లోకేష్‌తో ఇప్పాల రవీంద్రరెడ్డి.. టీడీపీ సీరియస్.. ఏం జరిగిందంటే
Ravindra Lokesh Meeting Controversy

అమరావతి, మార్చి 25: సోషల్ మీడియాలో చంద్రబాబు (CM Chandrababu Naidu), లోకేష్ (Minister Nara Lokesh) ఇతర టీడీపీ నేతలపై పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి (Ippala Ravindar Reddy).. మంత్రి లోకేష్‌ను కలవడంపై సోషల్ మీడియాలో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఈరోజు (మంగళవారం) ఉదయం సిస్కోతో (Cisco) ఏపీ ప్రభుత్వం (AP Govt) ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంవోయూ సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్‌గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఎంవోయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసిన వైనం తెలుసుకొని టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.


రవీంద్రారెడ్డి హాజరుపై ఆ తరువాత సోషల్ మీడియాలో తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను కూడా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు మళ్లీ వైరల్ చేస్తున్నారు. లోకేష్‌ను కలిసేందుకు ఇతన్ని ఎలా రానిచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్న పరిస్థితి.

Rajendra Prasad Apology: డేవిడ్ వార్నర్‌కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు


కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్న మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ పేషీ సిబ్బంది.. సిస్కోకు ఘాటుగా లేఖ రాసింది. సోషల్ మీడియాలో ఇప్పాల రవీంద్రారెడ్డి తమ పార్టీ న్యాయకత్వం, నేతలపై పెట్టిన పోస్టులను గురించి లోకేష్ ఓఎస్‌డీ సిస్కో యాజమాన్యానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరింది. తాము రాసిన మెయిల్‌పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కోను లోకేష్ పేషీ కోరింది.


అయితే... గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులన్నీ కూడా వల్గర్ పోస్టులని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కామెంట్లు పెడుతున్నారు. ఇటువంటి పోస్టులు పెడుతున్న వ్యక్తిని లోకేష్‌ను కలిసేందుకు రానిచ్చారంటూ పేషీ సిబ్బందిపై సోషల్ మీడియా కార్యకర్తలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్‌ను కలిసే సమయంలో ఎవరెవరు వస్తున్నారు, వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నిలదీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే లోకేష్ సీరియస్ అయ్యారు. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. ఇటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ల పూర్వ చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. ఇప్పాల రవీంద్రా రెడ్డి ప్రస్తుతం సిస్కోకు టెరిటరీ అకౌంట్ మేనేజర్‌ పనిచేస్తున్నారు. ఐదు రాష్ట్రాలకు ఆయన టెరిటరీ అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని చెబుతున్నారు. అతనికి ఇప్పుడు వైసీపీతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ గతంలో పెట్టిన పోస్టుల గురించి ఇప్పుడు వాటన్నింటినీ కూడా టీడీపీ కార్యకర్తలు బయటపెడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 04:57 PM