TDP Tiruvuru Issue: మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చనీయాంశంగా తిరువూరు అంశం
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:59 AM
TDP Tiruvuru Issue: తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు.

అమరావతి, మార్చి 29: మంగళగిరి టీడీపీ ఆఫీసులో (Mangalagiri TDP Office) తిరువూరు అంశం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) (Vijayawada MP Kesineni Shivanath) వెంట తిరువూరు మాజీ ఇన్‌చార్జ్ శావల దేవదత్ ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... తిరువూరు పంచాయతీని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని అన్నారు. ప్రతీ కుటుంబంలోనూ చిన్నపాటి వివాదాలు సహజమన్నారు. తిరువూరు సమస్యను పార్టీ కుటుంబ సమస్యగా అధిష్టానం కూర్చోపెట్టి పరిష్కరిస్తుందని తెలిపారు. తిరువూరు వరుస వివాదాలపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అందరి అభిప్రాయాలు ఇప్పటికే సేకరించి నివేదిక రూపొందించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.
అయితే మరికాసేపట్లో కొలికపూడి శ్రీనివాస్ విధించిన డెడ్ లైన్ ముగియనుంది. పార్టీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ అధిష్టానానికి కొలికపూడి 48 గంటల అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. తిరువూరు నియోజకవర్గంలో వివాదాలకు మూలం ఇసుక, మట్టి అని నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాగా.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొలికపూడి అల్టిమేటం జారీ చేసిన 48 గంటలు డెడ్‌లైన్ పూర్తికావొస్తోంది. దీంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొలికిపూడి వ్యాఖ్యలు చేయడం.. అంతే కాకుండా రమేష్ రెడ్డితో పాటు గిరిజన మహిళలు.. కొలికపూడిపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనానికి దారి తీసింది. నేటితో కొలికొపూడి విధించి 48 గంటల డెడ్‌లైన్ ముగియనుండటంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇదిలా ఉండగా.. తిరువూరు అంశం అధిష్టానం దృష్టికి వచ్చింది. దీంతో దీనిపై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని నెట్టు రఘురాం, ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ రాజులను పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో వారంతా కూడా తిరువూరులో స్థానిక టీడీపీ నేతల నుంచి వివరాలు సేకరించి ఓ నివేదికను రూపొందించి పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు లేదా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
TDP: తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం
Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..
Read Latest AP News And Telugu News