Share News

AP News: మూడో విడత నామినేటెడ్ పదవులు

ABN , Publish Date - Mar 25 , 2025 | 07:13 AM

నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు.

AP News: మూడో విడత నామినేటెడ్ పదవులు
CM Chandrababu Naidu

అమరావతి: ఉగాది (Ugadi) రోజున మూడో విడత (Third Phase) నామినేటెడ్ పదవుల (Nominated Positions) జాబితా విడుదల చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ (TDP) అధిష్టానం ప్రకటించింది. 50 నుంచి 60 ఏఎంసీలు జాబితా తుది కసరత్తు చేస్తోంది. త్వరలో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాలు చేపట్టనుంది. మహానాడు కల్ల అన్ని పదవులు భర్తీ చేయనుంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి పెద్ద సంఖ్యల ఆశావాహులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానానికి 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కాగా జనసేన,బీజేపీలు మరిన్ని పోస్టులు అడుగుతున్నారు.

Also Read..: పొట్టలో గడబిడ ఎందుకు


ఉగాది నాడు మూడో కోటా జాబితా విడుదల

నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ సారికి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండడంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావహులకు నిరాశేనని చెప్పవచ్చు. అయితే మహానాడుకల్లా అన్ని నామినేటెడ్‌ పదవులూ భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దరిమిలా రెండు నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై నాలుగు నెలలుగా కసరత్తు జరుగుతున్నా సామాజిక సమీకరణలు.. కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. రాష్ట్రంలో 218 మార్కెట్‌ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలినవాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు.


60 వేల పైచిలుకు దరఖాస్తులు

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి ఒక్క టీడీపీ నుంచే 60వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. పార్టీలో ఏ స్థాయిలో ఉన్నవారైనా కుటుంబ సాధికార సారథి (కేఎస్ఎస్) బాధ్యత చేపట్టాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఆశావహులు చాలామంది ఇప్పటికే ఆ బాధ్యతలు చేపట్టారు. నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు, పరసా రత్నం, దారపనేని నరేంద్ర, కనపర్తి శ్రీనివాసరావు, నాదెండ్ల బ్రహ్మం, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ప్రభాకర్‌ చౌదరి, గన్ని వీరాంజనేయులు సీట్ల సర్దుబాటులో టికెట్లు కోల్పోయారు. దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితుడు. వీరితోపాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడినవారు కూడా కీలకమైన నామినేటెడ్‌ పోస్టులు అడుగుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెల్టుతో కొట్టి, కాళ్లతో తన్ని...!

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: లోకేశ్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 07:13 AM