Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..
ABN , Publish Date - Feb 02 , 2025 | 09:32 AM
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్త కూడా చదవండి..
కాగా విశాఖ జిల్లా, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేపగుంట మచ్చమాంబ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన ఆదిత్య సాహూ (9), లక్ష్మీ సాహూ (7), గొర్లి గంగోత్రి (9) శుక్రవారం సాయంత్రం నుంచి వారు కనిపించడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. శారదా కాలనీలో అరండల్ పేట పోలీసులు ఇంటింటికి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 42 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ..110 మంది సిబ్బందితో తనిఖీలు చేశామని, నెంబర్ ప్లేట్స్, సరైన పత్రాలు లేని 43 బైక్‌లు, మూడు ఆటోలు సీజ్ చేసినట్లు తెలిపారు. నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలనే నేరాలకు ఉపయోగిస్తున్నారన్నారు. రౌడీ, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని, గుంటూరు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కార్డెన్ సెర్చ్ కొనసాగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News