Vamsi Remand: వంశీకి రిమాండ్‌పై కోర్టు నిర్ణయం ఇదీ
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:16 PM
Vamsi Remand: వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు పొడిగించింది.

విజయవాడ, మార్చి 28: గన్నవరం టీడీపీ కార్యాలయంపై (Gannavaram TDP Office) దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) రిమాండ్‌ను సీఐడీ కోర్టు (CID Court) పొడిగించింది. ఏప్రిల్ 9 వరకు వంశీ రిమాండ్‌లో ఉండనున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఏ71 గా ఉన్నారు. అంతేకాకుండా సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు వంశీ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని ఈ రోజు (శుక్రవారం) ఉదయం జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు గన్నవరం పోలీసులు.
వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9 వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిన్న (గురువారం) వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయాధికారి.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో బెయిల్ వస్తుందని అనుకున్న వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. తమకు బెయిల్ ఇవ్వాలని శివకుమార్, ఆదిలక్ష్మీ, ప్రవీణ్, రూతమ్మ పిటషన్ వేయగా.. దాన్ని కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నేటి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest AP News And Telugu News