Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:57 PM
Vallabhaneni Vamsi Remand: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా వంశీతో న్యాయాధికారి నేరుగా మాట్లాడారు.

విజయవాడ, మార్చి 25: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి (YSRCP Leader Vallabhaneni Vamsi) విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Vijayawada SC ST Court) రిమాండ్ పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఏప్రిల్ 8 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏ-1 వల్లభనేని వంశీ మోహన్, ఏ-4 గంటా వీర్రాజు, ఏ-7 ఎలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఏ-8 నిమ్మల లక్ష్మీపతి, ఏ-10 వేల్పూరు వంశీలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో వీరికి ఏప్రిల్ 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు.
విచారణ సమయంలో వంశీని న్యాయాధికారి నేరుగా పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు న్యాయాధికారి. గతంలో అనారోగ్యం దృష్ట్యా వేసిన పిటిషన్‌లపై మంచంతో పాటు పరుపు, దిండు కూడా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై న్యాయాధికారి ఆరా తీయగా.. సింగిల్ బ్యారేక్‌లో ఉన్నందున ఇబ్బందిగా ఉందని, వేరే బ్యారేక్ మార్చాలని లేదా.. ఇప్పటికే తనతో పాటు రిమాండ్‌లో ఉన్న వారిలో ఒకరిని కాని ఇద్దరిని కానీ ఉంచే వెసులుబాటు కల్పించాలని న్యాయాధికారికి వంశీ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి గతంలోనే పిటిషన్ వేసిన పరిస్థితులు, అప్పటి విచారణపై న్యాయాధికారి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా వేరే వారిని వంశీతో కలిపి ఉంచలేమని జైలు అధికారులు, పోలీసులు గతంలోనే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Mallareddy Comments On Assembly: అసెంబ్లీ అంటే అదీ.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
దీంతో అప్పటి నుంచి సింగిల్ బ్యారేక్‌లోనే ఉంచాలని న్యాయాధికారి సూచించారు. అదే అంశాన్ని ఈరోజు మరోసారి న్యాయాధికారి ప్రస్తావించారు. భద్రత దృష్ట్యా, జైలు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా వేరే వారిని మీతో ఉంచే అవకాశం లేదని స్పష్టం చేశారు. అది కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు మంచం, దిండు, పరుపు సౌకర్యం కల్పించారని.. వీలుంటే కుర్చీ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వినతి చేశారు. దీనిపై న్యాయధికారి సానుకూలంగా స్పందించి ఒక కుర్చీని ఏర్పాటు చేసేలా ఆదేశిస్తామని వంశీకి చెప్పారు.
అనంతరం ఇరువురు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వంశీ తరపున న్యాయవాది సత్యశ్రీ వాదనలు వినిపిస్తూ.. చాలా రోజులుగా వంశీ ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో సానుకూలంగా స్పందించాలని వినతి చేశారు. అయితే ప్రస్తుతం రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో మరోసారి వాదనలు వింటామని న్యాయాధికారి చెప్పారు. అనంతరం వంశీ రిమాండ్ ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ న్యాయాధికారి ఆదేశాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
AP High Court Case: బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు!
YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న
Read Latest AP News And Telugu News