Share News

YSRCP: పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 09:05 AM

పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం, ‌జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.

YSRCP: పెనుగంచిప్రోలు తిరుణాలలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు..
YSRCP

ఎన్టీఆర్ జిల్లా: పెనుగంచిప్రోలు Penuganchiprolu) తిరుణాలలో (Tirunal) వైఎస్సార్‌సీపీ (YSRCP) కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు (Police) సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. లక్ష్మీ తిరుపతమ్మ Lakshmi Tirupatamma) చిన్న తిరుణాలలో తెలుగుదేశం (TDP), ‌జనసేన (Janasena), వైఎస్సార్‌సీపీ (YSRCP)నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా, వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలకు దిగింది. వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు రాళ్లు విసిరారు. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపైనా రాళ్లు, వాటర్ ప్యాకెట్‌లు‌ విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది, ప్రజలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రెచ్చగొట్టేలా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

Chiranjeevi: లండన్‌లో మెగాస్టార్ చిరంజీవి..


కాగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతోనే రెచ్చగొట్టే చర్యలకు దిగి.. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయనగరంలో ‘కోర్ట్’ సినీ బృందం సందడి

70 ఏళ్ల క్రితం బెంగళూరు ఎలా ఉండేదో చూస్తే..

For More AP News and Telugu News

Updated Date - Mar 18 , 2025 | 09:35 AM