మధ్యంతర భృతి ప్రకటించాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:54 AM
సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు కోరారు.
గడివేముల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు కోరారు. మండల కేంద్రంలో గురువారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మధ్యంతరభృతి, కరువు బత్యం గురించి చర్చ వస్తుందని ఎదురు చూసినా ఉపాధ్యాయ, ఉద్యోగులకు నిరాశే మిగిలిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన ఇంతవరకు 12వ వేతన సవరణ సంఘానికి కమిషనర్‌ను నియమించలేదని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డీఏల గురించి చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిల్లు బకాయిలను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శులు మానపాటి రావి, ఆవుల మునిస్వామి, రాష్ట్ర కౌన్సిలర్లు మహబూబ్‌బాషా, నాగన్న తదితరులు పాల్గొన్నారు.