గోకులం షెడ్ల ప్రారంభం
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:34 AM
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ద్వారా రాయితీపై రైతులు నిర్మించుకున్న మూడు గోకులం షెడ్లను ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం ప్రారంభించారు.
నందికొట్కూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ద్వారా రాయితీపై రైతులు నిర్మించుకున్న మూడు గోకులం షెడ్లను ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్‌నాయుడు, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, బంగారు వెంకటేశ్వర్లు, ముచ్చుమర్రి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
బండిఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): మండలంలోని 7 గ్రామాల్లో 7 షెడ్లను ఎంపీడీవో దస్తగిరి, ఏపీవో వసుధ ఆధ్వర్యంలో ప్రారంభించారు. మినీ గోకులం షెడ్లను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుగంగ ప్రాజెక్టు వైస్ చైర్మన్ కంచర్ల మనోహర్‌చౌదరి, టీడీపీ అధ్యక్షుడు మండల నరసింహారెడ్డి సూచించారు. సర్పంచ్‌లు పుష్పాంజలి, సరిత, నాగమణి, శీను, లింగారెడ్డి, శంకర్, ఆంబ్రోస్, కృష్ణారెడ్డి, తిరుపాల్ పాల్గొన్నారు.
మహానంది(ఆంధ్రజ్యోతి): పాడి రైతుల కోసం కూటమి ప్రభుత్వం మినీ గోకులం షెడ్లను ఏర్పాటు చేసిందని కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు. ఉల్లిగడ్గల బొల్లవరం, ఎం. తిమ్మాపురం గ్రామాల్లో ఉపాధిహామీ పథకం, పశుసంవర్థక శాఖ సమన్వయంతో నిర్మించిన మినీ గోకులం షెడ్లను ఎంపీడీవో మహమ్మద్ దౌలా ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల చేత ప్రారంభించారు. ఎంపీపీ యశస్విని, జడ్పీటీసీ కేవీఆర్ మహేశ్వరరెడ్డి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ క్రాంతి కుమార్ యాదవ్, మండల టీడీపీ కన్వీనర్ నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి, యి.బొల్లవరం టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ మండల అధ్యక్షుడు మధు, ఏపీవో మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.
పాములపాడు(ఆంధ్రజ్యోతి): మద్దూరు, రుద్రవరం గ్రామాల్లో గోకులం షెడ్లను ఎంపీపీ సరోజినీ వర్జినీయా, ఎంపీడీవో చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఏపీవో విమలమ్మ, జేఈ రమేశ్‌నాయుడు, నాయకులు నసురుల్ల, నారాయణ, నరసింహ, అలీ, పెద్ద వెంకటరెడ్డి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్(ఆంధ్రజ్యోతి): మండంలోని పాడి రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం మిని గోకులం షెడ్లను మంజూరు చేస్తోందని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వడ్లరామాపురం, బాపనంనతాపురం గ్రామాల్లో గోకులం షెడ్లను ప్రారంభించారు. సర్పంచ్ దరగయ్య, ఏపీవో నాగమ్మ, పశువైద్యాధికారి అరుణ, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి, ప్రసాద్, టీడీపీ నాయకులు శ్రీరామ్‌రెడ్డి, లింగస్వామి, సుబ్బయ్య, వెంకటరమణ, మధు, రాజగోపాల్, బాబు రావు, శంకర్, శివప్రపాద్‌రావు పాల్గొన్నారు.
నంద్యాల రూరల్(ఆంధ్రజ్యోతి): పాండురంగాపురం, మిట్నాల, పుసులూరు, పోలూరు, కానాల గ్రామాల్లో గోకులాల ప్రారంభోత్సవాన్ని ఎంపీడీవో సుగుణశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మిట్నాల సాగునీటి సంఘ అధ్యక్షుడు రవిబాబు, ఏపీవో శ్రీకళ, ఈసీ సలావుద్దీన్, కానాల టీడీపీ నాయకులు హనీఫ్, లాయర్ బాబు తదితరులు పాల్గొన్నారు.