Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:45 PM
Pawan Farm Pond Inauguration: మే నెలలోపూ లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వర్షాల సమయంలో లక్షా 55 వేల నీటి కుంటలు నిండితే ఒక టీఎంసీ నీల్లు వస్తాయన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని.. అందరికీ కావాలన్నారు.

కర్నూలు, మార్చి 22: రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణంలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫాం పాండ్ నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) భూమి పూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. కష్ట సమయంలో కూటమిని గెలిపించారని.. 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారన్నారు. ఎన్డీయే కూటమిని 21 ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటారని.. ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రధానంగా కావాల్సింది కష్టపడి పనిచేయడమే అని తెలిపారు. రాయలసీమలో నీటి కష్టాలు అధికంగా ఉండేదన్నారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదన్నారు. మే నెలలోపూ లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాల సమయంలో లక్షా 55 వేల నీటి కుంటలు నిండితే ఒక టీఎంసీ నీల్లు వస్తాయన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్లు రాయలసీమ రతనాల సీమ అవ్వాలన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని.. అందరికీ కావాలన్నారు. ఒకే రోజు 13326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. పని చేసే సత్తా ఉందని.. పని కోసం దిశానిర్దేశం చేసే ఏ స్వార్ధం లేని వ్యక్తులు కావాలన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం కోరుకున్న విధంగా.. ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు ఇచ్చిన శాఖలను బలంగా చేయాలని ఒకే రోజు 13326 గ్రామసభలు నిర్వహించి.. అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామన్నారు.
Jagan Sharmila On Delimitation: పునర్విభజనపై జగన్, షర్మిల ఏమన్నారంటే
పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలను ఆమోదించిందన్నారు. గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మందికి ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామన్నారు. ఈ పథకం కింద రూ.9.5 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఉపాధి ఆర్థికత స్థిరత్వం కల్పించేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంటుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4వేల పైచిలుకు రోడ్లు మాత్రమే నిర్మించారని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. రూ.1600 కోట్ల వ్యయంతో రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. 100 మందికిపైగా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. లక్షా 55 వేల పంట కుంటలు నిండితే మనకు ఇబ్బంది ఉండదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Baroda MDGinext Mobile App: ఆ కస్టమర్ల కోసం బీవోబీ సరికొత్త ప్రయత్నం.. ఇంత అంతా సులువే
CM Chandrababu Tweet: సీఎం చంద్రబాబు సంచలన ట్వీట్.. లైట్లు ఆపేయాలంటూ..
Read Latest AP News And Telugu News