‘స్వామి వివేకానంద యువతకు ఆదర్శం’
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:10 AM
స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం అని గణేష్ కేంద్ర సమితి సభ్యులు అన్నారు.
నంద్యాల కల్చరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానంద యువతకు ఎంతో ఆదర్శం అని గణేష్ కేంద్ర సమితి సభ్యులు అన్నారు. పట్టణంలోని కల్పన సెంటర్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి ఆదివారం గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో విశ్వనాథ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, ఎలక్ట్రికల్ డీఈ సుధాకర్, గణేష్ కేంద్ర సమితి సభ్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డా.మధుసూదనరావు, శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్, బిజెపి పట్టణ అధ్యక్షుడు సుధాకర్, ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా, గణేష్ కేంద్ర సమితి సభ్యులు కలిసి మాలార్పణ చేశారు. అనంతరం కర్నూలు జిల్లా నెహ్రూయువ కేంద్రం వారి ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ చికాగోలోని సమావేశంలో ఆయన ప్రసంగం ద్వారా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారని అన్నారు. వివేకానందుని బోధనలు, ఆలోచనలు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో యువత తీసుకెళ్తే వందశాతం విజయవంతం అవుతాయన్నారు. కార్యక్రమంలో గణేష్ కేంద్ర సమితి సభ్యులు నాగేంద్ర, రామకృష్ణా విద్యాసంస్థల ఎన్‌సీసీ కేడెట్లు తదితరులు పాల్గొన్నారు.
వెలుగోడు(ఆంధ్రజ్యోతి): వెలుగోడు పట్టణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఏబీవీపీ కార్యలయంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ, ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద ఆశయాల కోసం పాటు పడాలని తెలిపారు. కార్యక్రమంలో రామలింగారెడ్డి, సుదాకర్, రాఘవయ్య, కృష్ణార్జునరెడ్డి, ప్రతాపచారి, నూలు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.