Share News

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:09 AM

గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప అన్నారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
సమావేశంలో మాట్లాడుతున్న నాగేంద్రప్ప

నంద్యాల రూరల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప అన్నారు. పట్టణంలోని ఉద్యోగ సంఘం కార్యాలయంలో ఆదివారం ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. నాగేంద్రప్ప మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వైద్య ఖర్చుల, సరెండర్‌ లీవ్‌ బిల్లులు, రిటైర్డ్‌ అయిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌ మొత్తం చెల్లించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు అవసరాల నిమిత్తం పెట్టుకున్న జీపీఎఫ్‌, జీఎల్‌ఐ రుణాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన నస్టాన్ని పూడ్చడానికి వెంటనే ఐఆర్‌ను మంజూరు చేసి పీఆర్సీ కమిషన్‌ నియమించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య, ఉపాధ్యక్షులు పకృద్దీన్‌, సునీల్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు సత్యం, కోశాధికారి శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:09 AM