Share News

మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:40 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు ప్రాతకోట గ్రామంలోని గంగా పార్వతి, నాగేశ్వరస్వామి తిరుణాల సందర్భంగా మంగళవారం జాతీయ స్థాయి మహిళ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.

 మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ హరినాథ్‌రెడ్డి

పగిడ్యాల, జనవరి 15(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పు ప్రాతకోట గ్రామంలోని గంగా పార్వతి, నాగేశ్వరస్వామి తిరుణాల సందర్భంగా మంగళవారం జాతీయ స్థాయి మహిళ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు జడ్డి జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ శేషమ్మ ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు హాజరు కావడంతో దేవాలయ ఆవరణం ఈలలు, కేరింతలతో మార్మోగింది.

Updated Date - Jan 16 , 2025 | 12:40 AM