Share News

High Court: వాళ్లిద్దరినీ ఇంటివద్దే విచారించండి

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:49 AM

మద్యం కుంభకోణం కేసులో శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లను వారి ఇంటివద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు 60 ఏళ్లకు పైబడినవారని కోర్టు గుర్తుచేసింది

High Court: వాళ్లిద్దరినీ ఇంటివద్దే విచారించండి

  • సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం

  • పిటిషనర్ల వయసు 60 ఏళ్లు పైబడిందన్న ధర్మాసనం

  • మద్యం కుంభకోణం కేసులో స్వల్ప ఊరట

అమరావతి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్‌ కాళీ మహేశ్వర్‌ సింగ్‌లను న్యాయవాది సమక్షంలో వారి ఇంటి వద్దే విచారించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు ఇరువురూ 60 ఏళ్లకు పైబడినవారని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో సాక్షులుగా తమ ముందు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసుల ఇచ్చారని, ఆన్‌లైన్‌ విచారణకు తాము చేసిన వినతిని తోసిపుచ్చడంతోపాటు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని చంద్రారెడ్డి, మహేశ్వర్‌ సింగ్‌ మంగళవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:49 AM