Share News

Bus Services : అదనపు బాదుడు లేకుండానే!

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:03 AM

అదనపు బాదుడు లేకుండా ఈసారి సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

Bus Services : అదనపు బాదుడు లేకుండానే!

  • సంక్రాంతికి ప్రత్యేక బస్సు సర్వీసులు

  • ప్రైవేటు బస్సుల్లోనూ ఆర్టీసీ రేట్లు తీసుకునేలా ప్రయత్నిస్తున్నాం

  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వెల్లడి

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): అదనపు బాదుడు లేకుండా ఈసారి సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతికి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో పండగకు ప్రత్యేక సర్వీసులు ఉంటే ప్రయాణికులపై అదనపు బాదుడు ఉండేది. ఈసారి అటువంటి అదనపు చార్జీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని చెప్పారు. రాయలసీమలో కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని చేసిన విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 06:03 AM