Share News

Minister Sathyakumar Yadav : 2024లో దురహంకార పాలనకు గుణపాఠం

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:19 AM

‘2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ప్రజా, అభివృద్ధి వ్యతిరేక, దురహంకార, అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారు.

Minister Sathyakumar Yadav : 2024లో దురహంకార పాలనకు గుణపాఠం

  • ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ‘2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ప్రజా, అభివృద్ధి వ్యతిరేక, దురహంకార, అవినీతి పాలనకు తగిన గుణపాఠం చెప్పారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని దిమ్మ తిరిగేలా తిప్పికొట్టారు’ అని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ‘రాష్ట్ర ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం రావడంతో పాటు యువతకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం ఖాయం. ప్రజలు ఆకాంక్షించే బంగారు భవిష్యత్తుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అండగా నిలుస్తారు. 2025లో ప్రజలు ఆరోగ్యంగా, సంపన్నులుగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలి’ అని సత్యకుమార్‌ ఆకాంక్షించారు.

Updated Date - Jan 01 , 2025 | 05:20 AM