Share News

పాలిటెక్నిక్‌ శిక్షణలో మార్పులు: మంత్రి నారా లోకేశ్‌

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:03 AM

మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్‌ శిక్షణలో మార్పులు తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

పాలిటెక్నిక్‌ శిక్షణలో మార్పులు: మంత్రి నారా లోకేశ్‌

విజయవాడ(ఆటోనగర్‌): మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా పాలిటెక్నిక్‌ శిక్షణలో మార్పులు తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో 2 రోజులపాటు నిర్వహించిన పాలిటెక్‌ ఫెస్ట్‌- 2025 ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. తొలుత పాలిటెక్నిక్‌ విద్యార్థులు రూపొందించిన 243 వైజ్ఞానిక ఆకృతులను తిలకించి, వాటి గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో రూ.8వేల కోట్ల విలువైన పరిశ్రమల స్థాపన దిశగా అడుగులేస్తున్నామన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా ప్రతి నగరంలో విద్యార్థుల నుంచి వినూత్న ఆలోచనలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రాజెక్టు తీసుకొచ్చే విధంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 04:03 AM