AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
ABN , Publish Date - Feb 03 , 2025 | 09:12 AM
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహం రచించారు. ఈ పదవిపై సోమవారం ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే భేటీ అయి.. డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇరువురు చర్చించారు.

నెల్లూరు: మున్సిపల్ కార్పొరేషన్‌లో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక (Deputy Mayor Election) జరగనుంది. ఈ పదవిని దక్కించుకునేందుకు మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) వ్యూహం (Strategy) రచించారు. మరి కాసేపట్లో 40 మంది కార్పోరేటర్లను వెంటపెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెళ్లనున్నారు. వైసీపీ (YCP) వైపు కేవలం 12 మంది కార్పోరేటర్లు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుచ్చి మున్సిపాల్టీలో ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. రెండు పదవులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు మద్దతు ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ విప్ జారీ చేసింది.
ఈ వార్త కూడా చదవండి..
కాగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) శనివారం భేటీ అయ్యారు. గంట పాటు ఈ సమావేశం సాగింది. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. నగర డిప్యూటీ మేయర్ నియామకంలో మంత్రి నారాయణ నిర్ణయం అంతిమమని చెప్పారు. మంత్రి నారాయణ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో మున్సిపల్ కమిషనర్ వర్సెస్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదం అవస్తవమని చెప్పారు. చట్టాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తారని అన్నారు. అధికారులకు రూల్ పొజిషన్ ప్రకారమే నడుచుకోమని చెప్పామని అన్నారు. ట్యాక్స్ విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సమయం ఇవ్వడంతో పాటు నెల వాయిదాల్లో కట్టమన్నామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలు కట్టాల్సిన ట్యాక్స్ విషయంలో ఆలస్యం అయితే సిస్టం ఎలా నడుస్తుందని అడిగారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని, ప్రజల నాడి ఆయనకు బాగా తెలుసునని చెప్పారు. ప్రజలు ట్యాక్స్ కడితే వారికి కావాల్సిన వసతులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డిప్యూటీ మేయర్ నియమకంపై కార్పొరేటర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ కీలక సమావేశం
బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News