Share News

ISRO: కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్..

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:56 PM

ISRO: గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60 పీఎస్‌ఎల్వీలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1బీ, 15 గంటల12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తరువాత వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.

ISRO: కొత్త ఏడాదిలో ఇస్రో సరికొత్త రికార్డ్..
ISRO

నెల్లూరు, జనవరి 16: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60 పీఎస్‌ఎల్వీలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది.


ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1బీ, 15 గంటల12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తరువాత వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈరోజు(గురువారం) వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్‌ను మొదలుపెట్టారు.

Manchu Majoj: రోజుకో వివాదం... మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది..


ఇది విజయవంతం అయినట్లు ఇస్రో తమ పోస్టులో తెలియజేసింది. దీని కోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది. మొత్తానికి ఇస్రో మరో మైలురాయి చేరింది. రెండు ఉపగ్రహాలను సాంకేతికంగా అనుసంధానం చేసే వరుసలో భారత్ చేరింది.


అంతరిక్షంలో స్పీడెక్స్ డాకింగ్ అనేది శాస్త్ర, సాంకేతికపరంగా చాలా క్లిష్టమని చెప్పుకోవచ్చు. కానీ ఇస్రో మాత్రం స్పీడెక్స్ డాకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్షంలో రెండు శాటిలైట్స్‌ను దగ్గరకు చేర్చి మరోసారి ప్రపంచ దేశాలకు భారత్ సత్తా ఏంటో చూపించింది. చైనా, రష్యా, అమెరికా సరసన భారత్‌ను చేర్చి ప్రతీ భారతీయుడు గర్వించేలా చేసింది ఇస్రో. దాదాపు వందకిలోల మీటర్ల వేగాన్ని ఒక్కసారిగా 0.013 కిలోమీటర్ల వేగానికి తగ్గించి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. 220 కేజీల బరువున్న ఒక్కో శాటిలైట్‌ను ఒక్కచోటకు చేర్చి కలిపారు. రెండు ఉపగ్రహాలను ఒకదగ్గరకు చేర్చడంలో ఇస్రో సక్సెస్ అవడంతో ఇస్రోలో సంబరాలు చేసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

రుణాల కోసం పాస్‌పుస్తకాలు అడగొద్దు

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారా.. బిగ్ అలర్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 16 , 2025 | 03:26 PM