Pigeon Fight.. రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:36 AM
పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది.. టెక్నాలజీ కూడా పెరిగింది. దీంతో కొంతమంది పావురాలతో పందేలు కాస్తున్నారు.

నెల్లూరు: జిల్లాలో పావురాళ్ల పందాల (Pigeon fight) నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు (Tamilnadu) నుంచి ఐషర్ ట్రక్కుల్లో పావురాళ్లని పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లా (Nellole)కు తరలిస్తున్నారు. కన్యాకుమారి (Kanyakumari), తిరుత్తని (Tiruttani), తిరునల్వేలి (Tirunelveli)లోని క్లబ్బుల నుంచి పావురాలను తరలిస్తున్నారు. బిట్రగుంట రైల్వే ఫుట్ బాల్ క్రీడా మైదానం నుంచి క్లబ్ నిర్వాహకులు 800 పావురాళ్లను వదిలారు. అక్కడ రూ.కోట్లలో పందాలు జరుగుతున్నాయి. గతంలో చెన్నై నుంచి పావురాళ్లతో వచ్చే క్లబ్బుల సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి పంపివేశారు. అప్పటి నుంచి చెన్నై క్లబ్బుల సిబ్బంది రాక పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాకు క్లబ్బుల సిబ్బంది, పందెం రాయుళ్లు వస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
త్వరగా గమ్యం చేరుమా..
నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, బిట్రగుంట రైల్వే ఫుట్‌బాల్ క్రీడామైదానం.. అక్కడకు చిన్న లారీ వచ్చి ఆగింది. అందులోంచి దించిన 28 క్రేట్లను అలా తెరవగానే.. దాదాపు 800 పావురాలు పరుగు పందెంలో పాల్గొన్నట్లుగా వాయువేగంతో ఎగిరిపోయాయి. తమిళనాడులోని కన్యాకుమారి, తిరుత్తణి, తిరునల్వేళి ప్రాంతాలకు చెందిన పావురాల పెంపకందారులు వాటికి పందెం పెట్టుకున్నారట.. తాము కాసిన పందెం ప్రకారం పావురాలు 1,550 కిలోమీటర్ల దూరంలోని కన్యాకుమారికి 7 గంటల్లో చేరుకోవాల్సి ఉంటుందని చెప్పా రు. ఇంత దూరం వెళ్లాలంటే రైలులో 18 గంటలు, బస్సులో అయితే 24 గంటలు పడుతుందని తెలిపారు.
పావురంతో లేఖల రాయభారం
పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుతం కాలం మారింది.. టెక్నాలజీ కూడా పెరిగింది. దీంతో కొంతమంది పావురాలతో పందేలు కాస్తున్నారు. జూదం, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్ సరసన ప్రస్తుతం పావురాల పందేలు చేరాయి. దీనిపై జూదరులు రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు.
పౌష్టికాహారం..
కొంతమంది తమ ఇళ్లల్లో పావురాలు పెంచుకుంటుండగా.. ఈ ముసుగులో మరికొందరు జూదానికి పాల్పడుతున్నారు. పందేలకు వినియోగించే పావురాళ్లకు పౌష్టికాహారం అందిస్తారు. అవి బలిష్టంగా మారి సులువుగా ప్రయాణం చేస్తాయి. వాటిని జూదం పేరుతో హింసిస్తుండటం తగదని వన్యప్రాణుల సంరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతి మరింత విస్తరించక ముందే జూదరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..
బ్యాంకులోకి పెట్రోల్ క్యాన్లతో వచ్చిన వ్యక్తి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News