Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:16 PM
Kakani Police Notice: కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈసారి విచారణకు రాకపోతే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు.

నెల్లూరు, మార్చి 31: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Former Minister Kakani Goverdhan Reddy) పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఈరోజు (సోమవారం) విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. రేపు (మంగళవారం) విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని (Hyderabad) కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని.. లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు.
కాగా.. కాకాణి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అక్రమమైనింగ్ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కాకాణిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. తనను ఏమీ చేయాలేరు.. అక్రమ కేసులు బనాయించినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న కాకాణి.. ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఈ కేసులో కాకాణితో పాటు ఐదుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో గేట్లకు నోటీసులు అతికించారు.
Nidhi Tewari: చిన్న వయసులోనే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా.. ఎవరీ నిధి తివారీ
ఆ తరువాత కొద్దిసేపటికే తాను ఎక్కడికీ పారిపోలేదంటూ కాకాణి ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. వెంటనే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లాగా.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా కాకాణి లేరని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన సమీప బంధువుకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణి హాజరుకావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
Nagar Kurnool Incident: దైవదర్శనానికి వచ్చిన మహిళపై దారుణం
Kodali Nani Health: ప్రత్యేక విమానంలో ముంబైకి కొడాలి నాని.. కారణమిదే
Read Latest AP News And Telugu News