Home » Kakani Govardhan Reddy
Kakani Govardhan: పోలీసులపై, రెవెన్యూ సిబ్బందిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
‘వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్యపై సీఐ సుబ్బారావు, ఆర్ఐ రవి తప్పుడు కేసు పెట్టారు.
కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే తాము భయపడమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency)లో ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.200కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్(Kakani Govardhan Reddy) ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు సర్పంచ్ బూదూరు లక్ష్మి(Bhuduru Lakshmi) సంతకాన్ని ఫోర్జరీ చేసి పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సర్పంచ్ను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల్లో ఘోర ఓటమితో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్టేషన్ వెళ్లగక్కారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో కాకాణి ఘోరపరాజయం పాలయ్యారు. అపజయాన్ని కాకాణి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.